Chhattisgarh Congress: అమిత్ షాపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..

By :  Krishna
Update: 2023-10-18 04:20 GMT

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో 5 రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. రాజకీయ నేతలు ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వేడిని పెంచుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ తరుపున అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అమిత్ షాపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా మత హింసను ప్రేరేపించారని ఆరోపించింది.

బెమెతరలోని బీరాన్‌పూర్ గ్రామంలో జరిగిన మత హింసలో భూపేష్ బఘేల్ హస్తం ఉందని అమిత్ షా ఆరోపించారు. ఇందులో ఈశ్వర్ సాహు కుమారుడు భునేశ్వర్ సాహు మరణించాడు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసంమే బఘెల్ ప్రభుత్వం భువనేశ్వర్ సాహుల్ హత్యకు కారణమైందన్నారు. భువనేశ్వర్ సాహు హత్యకు పాల్పడిన వారిని న్యాయస్థానం ముందు ఉంచుతామని షా అన్నారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓడిపోతుందన్న భయంతోనే షా మతహింస రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. అమిత్ షా చేసిన ఈ ప్రకటన రాష్ట్రంలో మత హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడింది. వెంటనే ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. కాగా భువనేశ్వర్‌ సాహు తండ్రి ఈశ్వర్‌ సాహుకు బీజేపీ టిక్కెట్‌ ఇచ్చింది.

Tags:    

Similar News