సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్..

Byline :  Krishna
Update: 2023-09-03 08:00 GMT

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆహెను ఢిల్లీలోని సర్‌ గంగారాం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. సోనియా జ్వరంతో బాధపడుతున్నారని.. ఆమె పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆమె పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అగస్ట్ 31న ముంబైలో జరిగిన ప్రతిపక్షాల కూటమి సమావేశంలో సోనియా పాల్గొన్నారు. అంతకుముందు ఆమె జమ్మూ కశ్మీర్లో పర్యటించారు.

Tags:    

Similar News