Sonia Gandhi : ఢిల్లీకి సోనియా గుడ్‌బై.. మకాం మర్చేశారు..

Byline :  Mic Tv Desk
Update: 2023-11-14 11:45 GMT

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశ రాజధాని ఢిల్లీకి గుడ్ బై చెప్పేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలో ఉండడం మంచిది కాదని వైద్యులు సూచించడమే దీనికి కారణం. దేశ రాజధానిలో కాలుష్యం తగ్గేవరకు సోనియా రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఉంటారు. సోనియా శ్వాససంబంధ సమస్యలకు గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని రెండు నెలల కిందటే డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీలో ఎప్పుడూ ఉండే కాలుష్యానికి తోడు దీపావళి టపాసుల కాలుష్యం కూడా తోడు కావడంతో గాలి మరింత పాడైంది.

మంగళవారం ఢిల్లీ గాలి నాణ్యత సూచీ 375గా నమోదైంది. జైపూర్ నగరంలో ఇది 72 మాత్రమే. సోనియా గాంధీ మంగళవారం జైపూర్ చేరుకుంటారు. కాంగ్రెస్ ఎన్నికల సభలో బిజీగా ఉన్న తనయుడు రాహుల్ ఈ రోజు రాత్రి జైపూర్ వెళ్లి ఆమెను కలుసుకుంటారు. బుధవారం ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. గురువారం మళ్లీ జైపూర్ వెళ్తారు. సోనియా గాంధీ 2020లోనూ ఢిల్లీ కాలుష్యాన్ని తట్టుకోలేక వైద్యుల సలహాపై గోవాకు వెళ్లి కొన్ని నెలలు ఉన్నారు.


Tags:    

Similar News