రైలు ప్రమాదానికి కారణమైన వారిని క్షమించం : మోడీ

Update: 2023-06-03 14:24 GMT

ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు, కేంద్రమంత్రిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతరం కటక్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న మోడీ పరామార్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ రైలు ప్రమాదం తన మనుసును కలిచివేసిందని ప్రధాని మోడీ చెప్పారు. ప్రమాదానికి కారణమైన వారిని క్షమించమని ప్రధాని మోడీ అన్నారు. బాధ్యులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైలు ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కాగా సిగ్నలింగ్ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదిక ద్వారా తెలుస్తోంది. మొదట కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ కు మెయిన్ లైన్కు సిగ్నల్ ఇచ్చినా.. ఆ తర్వాత దానిన ఆపేయడంతో ఈ రైలు రాంగ్ ట్రాక్లోకి వెళ్లినట్లు నిపుణులు గుర్తించారు. సిగ్నలింగ్ లోపంతో మెయిన్ లైన్లోకి వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్‌ లైన్‌లోకి వెళ్లి గూడ్స్ ట్రైన్ను ఢీకొట్టినట్లు నివేదికలో ఉంది. మానవ తప్పిదం కారణంగానే ఇది జరిగి ఉండొచ్చని ఓ రైల్వే అధికారి చెప్పారు.

pm modi visits odisha train accident site

train accident,pm modi,railway minister,coromandel express,odisha,goods train,balasore,chennai,Howrah Superfast Express,.

Tags:    

Similar News