Corona Cases: భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

Byline :  Bharath
Update: 2024-01-05 11:05 GMT

భారత్ లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. కొత్తగా 761 కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వం శాఖ తెలిపింది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 4423 నుంచి 4334కి తగ్గాయి. కేరళలో 1249 యాక్టివ్ కేసులు ఉండగా.. కర్నాటకలో 1240, మహారాష్ట్రలో 914, తమిళనాడులో 190, చత్తీస్ గఢ్ 128, ఆంధ్రప్రదేశ్ లో 128 ఉన్నాయి. ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 4.5 కోట్లుగా ఉంది. కాగా కేరళలో 5, కర్నాటకలో 4, మహారాష్ట్రలో 2, ఉత్తర్ ప్రదేశ్ లో 1 తాజాగా మరణాలు జరిగాయి.

కొత్త వేరియంట్ జే.ఎన్.1 వెలుగు చూసినప్పటి నుంచి దేశంలో రెండంకెల కేసులు నమోదవుతున్నాయి. ఈ మధ్య వాతావరణంలో మార్పులు వచ్చి చలి తీవ్రత పెరగడంతో.. కొవిడ్ కేసుల సంఖ్య కూడా పెరిగింది. 

Tags:    

Similar News