విపక్షాలకు తమపై విశ్వాసం లేకున్నా.. మోదీ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని కేంద్ర హోంమంత్ర అమిత్ షా అన్నారు. ఎన్టీఏ ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వా తీర్మానంపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్న ఆయన.. రెండుసార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చామని చెప్పారు. అవిశ్వాసంతో కొన్నిసార్లు కూటముల బలమెంతో తెలుస్తుందన్నారు.
ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ఇంకా ఉందని అమిత్ షా అన్నారు. 1999లో వాజ్పేయి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారని.. అప్పట్లో ఒక్క ఓటుతో ఆయన ఓడిపోయారని చెప్పారు. 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే.. కాంగ్రెస్ ఎంపీలను కొని అవిశ్వాన్ని నెగ్గిందని ఆరోపించారు. కాంగ్రెస్ లాగా వాజ్పేయి తన ప్రభుత్వాన్ని కాపాడుకోలేకపోయారని చెప్పారు. దేశంలో 30ఏళ్ల తర్వాత రెండుసార్లు సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అత్యంత నమ్మకమైన ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది మోదీ మాత్రమే అని చెప్పారు.
9 స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ మోదీ ప్రధాని అయ్యాక 5వ స్థానానికి వచ్చిందని అమిత్ షా తెలిపారు. మోదీ మూడోసారి పీఎం అవ్వడం ఖాయమని.. 2027 నాటికి ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందన్నారు. 9ఏళ్లలో ప్రధాని 50 విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని షా చెప్పారు. 60కోట్ల మంది పేదల బతుకుల్లో మోదీ వెలుగులు నింపారని అన్నారు. డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో డైరెక్టుగా నగదు జమ చేస్తున్నామని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు అది మోదీ వ్యాక్సిన్ అని దానిని తీసుకోవద్దని రాహుల్, అఖిలేష్ చెప్పారని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ది కరప్షన్ క్యారెక్టర్ అని.. తాము ఉచితాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. మోదీ ఒక్కరోజు సెలవు తీసుకోకుండా రోజుకు 17గంటలు పనిచేస్తున్నారని వివరించారు. గత తొమ్మిదేళ్లలో కొత్త రాజకీయానికి మోదీ శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇండియా కూటమి అత్యంత అవినీతిమయమైన కూటమి అని విమర్శించారు. తాము అభివృద్ధి ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నామని తెలిపారు.
corruption is congress character says home minister amit shah
amit shah,rahul gandhi,pm modi,No-Confidence motion,parliament,congress,manipur violence,bjp,