Gyanvapi mosque case: మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి

Byline :  Veerendra Prasad
Update: 2024-01-31 10:23 GMT

ఢిల్లీ: జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో పూజలు చేసేందుకు అనుమతినివ్వాలని కోరిన హిందువులకు సానుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. జ్ఞానవాపి నేలమాళిగలో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. వారంలోగా పూజలకు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇకపై మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేయనున్నారు హిందువులు. కోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మసీదులో హిందూ దేవతల విగ్రహాలున్నాయని ఇటీవలే పురావస్తు శాఖ(Archaeological Survey of India) సర్వే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది. Vyas Ka Tekhana ప్రాంతం వద్ద హిందువులు పూజలు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. హిందువుల తరపున అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ వాదించారు. మసీదు లోపల పూజలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు. కాశీ విశ్వనాథ్ ట్రస్‌ ఈ తీర్పుపై స్పందించింది. ఇది హిందువుల విజయం అంటూ ఆనందం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల్లో పూజలు మొదలు పెడతామని వెల్లడించింది.

Tags:    

Similar News