15 గంటల్లో..286 స్టేషన్లు..ఢిల్లీ యువకుడి గిన్నిస్ రికార్డ్

Update: 2023-06-27 04:39 GMT

దేశ రాజధాని ఢిల్లీ మొత్తాన్ని ఒకే రోజులో మెట్రో రైలులో చుట్టేసి అరుదైన రికార్డును సృష్టించాడు

ఓ యువకుడు. దిల్లీ వ్యాప్తంగా ఉన్న 286 మెట్రో స్టేషన్లను 15 గంటల వ్యవధిలో చుట్టేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‎ల్లోనూ స్థానం సంపాదించాడు. అయితే ఈ రికార్డే కాస్త ఆలస్యంగా యువకుడికి అందింది. 2021లో ఈ రికార్డును యువకుడు సాధించగా గిన్నీస్ బుక్ ఈ మధ్యనే అతని టాలెంట్‎ను గుర్తించి తమ రికార్డుల్లో పేరును నమోదు చేసింది.




 


ఢిల్లీ నగరవాసి అయిన శశాంక్ ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఓ పరిశోధన విభాగంలో ఫ్రీలాన్సర్‎గా పని చేస్తున్న శశాంక్ 2021 ఏప్రిల్ 14వ తేదీన ఈ రికార్డును సృష్టించాడు. అందుకోసం శశాంక్ ఉదయం 5 గంటలకు ఢిల్లీ మెట్రో కు చేరుకున్నాడు. బ్లూ లైన్‎లో తన జర్నీని స్టార్ట్ చేశాడు. ఏ స్టేషన్ మిస్ కాకుండా మెట్రోలోని అన్ని స్టేషన్లను టచ్ చేశాడు. తిరిగి తన జర్నీ మొదలు పెట్టిన చోటుకు అదే రోజు రాత్రి 8.30 నిమిషాలకు చేరుకున్నాడు. ఇలా ఢిల్లీలోని అన్ని స్టేషన్లను తిరగడానికి శశాంక్ 15 గంటల 22 నిమిషాల 49 సెకన్లు పట్టింది. ఈ అరుదైన జర్నీని గిన్నిస్ గుర్తించింది. రెండేళ్ల తరువాత రికార్డును శశాంక్‎కు అందించింది.




 


గిన్నిస్ బుక్ టర్మ్స్ అండ్ కండీషన్స్ అనుగుణంగానే తన జర్నీని పూర్తి చేశాడు శశాంక్. అంతే కాదు ఆధారాల కోసం తాను వెళ్లిన ప్రతి స్టేషన్లో ఓ ఫోటో దిగి సేవ్ చేసుకున్నాడు. సాక్ష్యాలుగా అక్కడ ఉన్న వారి సంతకాలను తీసుకున్నాడు. తాజాగా తనకు గిన్నిస్ రికార్డ్ వచ్చిన ఆనందాన్ని శశాంక్ ట్విటర్‎లో పంచుకున్నారు. గిన్నిస్ వారు అందించిన సర్టిఫికేట్‎ను షేర్ చేశాడు.








 




 


Tags:    

Similar News