దూసుకొస్తున్న "బిపర్ జోయ్".. ముంబైకి పొంచి ఉన్న తుఫాన్ గండం..

Update: 2023-06-06 17:16 GMT

అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడింది. దానికి బిపర్ జోయ్ అని పేరు పెట్టారు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో గోవాకు నైరుతి దిశలో 950కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం బిపర్ జోయ్ తుఫాను ముంబైకి 1050కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ తుఫాను 4 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశలో కదులుతోంది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారుతుందని ఐఎండీ తెలిపింది.

తుఫాను కారణంగా ముంబైలో భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ చెప్పింది. బలమైన ఈదురు గాలులకు తోడు తీర ప్రాతంలో అలలు ఎగిసిపడతాయని అధికారులు ప్రకటించారు. బిపర్ జోయ్ ప్రభావంతో జూన్ 8 నుంచి 10వ తేదీ మధ్య మహారాష్ట్ర అంతటా భారీ వర్షాలు పడతాయని, ముంబై, పూణేలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. మరముంబైతో పాటు కొంకణ్ ప్రాంతాల్లో జూన్ 12 వరకు వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

బిపర్ జోయ్ తుఫాను ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. తుఫాను కారణంగా రుతుపవనాలు అరేబియా సముద్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించినా ముందుకు కదలడంలో ఆటంకాలు ఏర్పరుస్తుందని అధికారులు ప్రకటించారు. ఫలితంగా వాటి విస్తరణ మరింత ఆలస్యమవుతుందని అంటున్నారు.


Tags:    

Similar News