Threat to Sharad Pawar: శరద్ పవార్‌ను చంపేస్తామని వాట్సప్ లో బెదిరింపులు
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు ఆయన కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. శుక్రవారం ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు కమిషనర్‌ను కలిసి మీడియాతో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తన తండ్రి శరద్ పవార్‌ను చంపుతామని గురువారం తన ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్ వచ్చిందని.. హత్య చేస్తామని బెదింపులు వచ్చిపట్లు తెలిపారు. ఈ విషయమై న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. ఇలాంటి చర్యలు, నీచ రాజకీయాలు ఆపాలన్నారు. మహారాష్ట్ర హోం మంత్రి మరియు కేంద్ర హోం మంత్రిని దీనిపై జోక్యం చేసుకోవాలన్నారు.
ఒక మహిళగా, మహారాష్ట్ర పౌరురాలిగా.. ఈ దేశ హోం మంత్రి నుండి న్యాయం కోరుతున్నాను. శరద్ పవార్‌కు ఏదైనా జరిగితే దేశం, రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలి. నా తండ్రిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ నిఘా యంత్రాంగంపై ఉంది. మహారాష్ట్రలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో భయానక వాతావరణం నెలకొంది. ఈ బెదిరింపు వెనుక ఎవరున్నారో తెలియాలి అని సుప్రియా సూలే అన్నారు