మెట్రోలో మద్యం అనుమతి...!

Update: 2023-06-30 10:15 GMT

వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్ మెట్రోలు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మెట్రో సేవలు అందిస్తున్నాయి.

సురక్షితమైన ప్రయాణం అందించేందుకు మెట్రోలో కొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నారు. మెట్రోల్లో మద్యం తీసుకురావడం నిషేధం. ఢిల్లీ మెట్రోలో కూడా ఇలాంటి ఆంక్షలు కొనసాగాయి. కానీ తాజాగా ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.




 


ఇటీవల సడలించిన నిబంధనలు ప్రకారం ఏ మెట్రో రూట్‌లోనైనా ఒక వ్యక్తి రెండు బాటిళ్ల మద్యం వరకు తీసుకువచ్చేందుకు అనుమతి ఉంది.కేవలం సీల్డ్ చేసిన బాటిల్స్‌ను మాత్రమే అనుమతిస్తారు. ఈ అంశంలో యాజమాన్యం సీఐఎస్‌ఎఫ్‌, డీఎమ్‌ఆర్‌సీ సభ్యులతో ఓ కమిటీని వేసింది.

మెట్రోలో మద్యాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుందా? అని ఓ వ్యక్తి ట్విట్టర్‌ వేదికగా అడిగిన ఈ ప్రశ్నకు ఢిల్లీ మెట్రో(డీఎమ్‌ఆర్‌సీ ) సమాధానం తెలిపింది.రెండు మద్యం బాటిళ్ల వరకు తీసుకురావడానికి మెట్రోలో అవకాశం ఉంటుందని డీఎమ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. 

Tags:    

Similar News