దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఖలిస్థానీ (Khalistan) మద్దతుదారులు రెచ్చిపోయారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని 5 మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థాన్‌కు మద్దతుగా గ్రాఫిటీ (రంగులతో స్ప్రే చేయడం)తో రాశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ) పేరుతో ఖలిస్థాన్‌కు మద్దతుగా ఢిల్లీలోని శివాజీ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి పంజాబీ బాగ్ వరకు ఉన్న పలు స్టేషన్లలో రాశారు.
సెప్టెంబరు 9, 10 తేదీల్లో దిల్లీలో జీ20 (G20 Summit) సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్‌కు మద్దతుగా రాతలు కలకలం రేపాయి. గతంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలో నివసిస్తున్న ఖలిస్థానీ మద్దతుదారులు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.