మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృతా ఫడణవీస్‌ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన కేసులో 56 ఏళ్ల బుకీ అనిల్ జైసింఘాని అతని 24 ఏళ్ల కూతురు అనిక్ష జైసింఘనిపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు అయ్యింది. నిందితులు ఇద్దరినీ అమృత ఫడణవీస్ సాయంతోనే అరెస్టు చేసినట్లు మలబాల్ హిల్ పోలీసులు ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న అనిల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్నో కేసుల్లో అనిల్ నిందితుడుగా ఉన్నాడు. గత 8 ఏళ్లుగా అతడిని పట్టుకునేందకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసుల కన్నుగప్పి అనిల్ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో పోలీసులు అనిల్‌ను పట్టుకునేందుకు అమృతా ఫడణవీస్ సహాయం తీసుకుని ఓ సీక్రెట్ ప్లాన్ చేశారు. అతనితో ఫోన్లో టచ్‌లోకి వెళ్లాలని పోలీసులు ఆమెకు తెలిపారు.
పోలీసుల సూచనల మేరకు అమృతా ఫడణవీస్ ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో భాగమయ్యాడు. వారు చెప్పినట్లే అనిల్‌తో ఫోన్లో చాట్ చేశారు. మీ కేసుల గురించి నేను దేవేంద్ర ఫడణవీస్‌తో మాట్లాడతానని అతడికి అమృత ఓ మెసేజ్ పంపించింది. వెంటనే అనిల్ ఆమె ఫోన్‌కు కొన్ని ఆడియో మెసేజ్‌లను , డాక్యుమెంట్లను పంపించాడు. అలర్ట్ అయిన పోలీసులు నిందితుడి లొకేషన్‌ను ట్రేస్ చేశారు. అతడిని పట్టుకున్నారు. మార్చి 16న అనిక్షను, 19న అనిల్ జైసింఘానీని అదుపులోకి తీసుకున్నారు.