Supreme Court : డిప్యూటీ సీఎంల నియామకం ఉల్లంఘన కాదు ..సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Update: 2024-02-12 10:07 GMT

రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఈ విధానాన్ని అవలంబించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదని స్పష్టం చేసింది. వారికి కేబినెట్ మంత్రి హోదా మంత్రమే ఉంటుందని తెలిపింది. ఉప ముఖ్యమంత్రుల నియమకాన్ని సవాల్ చేస్తూ పబ్లిక్ పొలిటికల్ పార్టీ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఆ పదవి ఇవ్వడం ద్వారా రాష్ట్రాలు తప్పుడు ఉదాహరణగా నిలుస్తున్నాయని పిటిషనర్ ఆరొపించారు. చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ ఈ తీర్పును ఇచ్చింది. రాజ్యాంగ విలువ ప్ర‌కారం డిప్యూటీ సీఎంల నియామ‌కం జ‌రుగుతుంద‌ని ధ‌ర్మాసనం తెలిపింది. ముఖ్య‌మంత్రి ప‌రిధిలో ఉండే మంత్రిమండ‌లిలో డిప్యూటీ సీఎంలు భాగ‌మ‌ని కోర్టు పేర్కొన్న‌ది.

డిప్యూటీ సీఎంల నియామ‌కాన్ని త‌ప్పుప‌డుతూ దాఖ‌లైన పిల్‌ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. డిప్యూటీ పోస్టుల గురించి రాజ్యాంగంలో ఎక్క‌డా లేద‌ని పిటీష‌న‌ర్లు వాదించారు. అయితే డిప్యూటీ సీఎంల నియామ‌కం రాజ్యాంగ ఉల్లంఘ‌న కింద‌కు రాదు అని సుప్రీంకోర్టు తెలిపింది.‘‘పార్టీ లేదా సంకీర్ణ ప్రభుత్వంలోని సీనియర్‌ నాయకులకు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి చాలా రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమించే పద్ధతిని అవలంబిస్తున్నాయి. అయితే, అది కేవలం ఒక పేరు మాత్రమే. ఉప ముఖ్యమంత్రులుగా ఎవర్నైనా నియమించినా వారు కేబినెట్‌ మంత్రి హోదాలోనే ఉంటారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి ఉపముఖ్యమంత్రి మొట్టమొదటి, అత్యంత ముఖ్యమైన మంత్రిగా ఉంటారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదు’’ అని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. సీఎంకీ సహాయ సహకారాలు అందించేందుకు, సీనియర్లకు తగిన ప్రాధాన్యం కల్పించేందుకు చాలా రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమిస్తుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకరి కంటే ఎక్కువ ఉపముఖ్యమంత్రులు ఉన్న సందర్భాలున్నాయి. అయితే, వారికి కేబినెట్‌ మంత్రి హోదాలోనే వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు.

Tags:    

Similar News