సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసుపై దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు

Update: 2023-06-29 13:42 GMT

సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ డెత్ మిస్టరీ ఇంకా వీడట్లేదు. ఈ కేసుపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అతి ముఖ్యమైన ఆధారాలను సేకరించినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఈ కేసులో తొలుత ఉన్న సమాచారం.. ఇతరుల మాటలే ఆధారంగానే ఉన్నాయి. కానీ, ఆ తర్వాత కొంతమంది ఈ కేసుకు సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని సీబీఐకి చెప్పారు. వాటిని సీబీఐ స్వాధీనం చేసుకుంది. చర్యలు చేపట్టి, ప్రాథమిక సాక్ష్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్తుతుల్లో ఈ కేసు గురించి ఏం మాట్లాడలేన’ని చెప్పారు.

కాగా, 2020 జూన్ లో సుశాంత్ సింగ్ ముంబైలోకి తన అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కన్పించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా అభిమానుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మొదటి సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని అంతా భావించారు. కానీ, ఇందులో కుట్ర కోణం ఉందని సుశాంత్ కుటుంబ సభ్యులు అనుమానించడంతో.. సీబీఐ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు సుశాంత్ చనిపోవడానికి వారం రోజుల ముందు.. ఆయన మాజీ మేనేజర్ సాలియన్ కూడా అనుమాస్పద రీతిలో మృతి చెందింది. దాంతో సుశాంత్ ను కుట్ర చేసి చంపేశారని చాలామంది బలంగా నమ్ముతున్నారు. 




Tags:    

Similar News