Ayodhya : బాలరాముని దర్శనానికి బారులు తీరిన భక్తులు

Update: 2024-01-29 02:51 GMT

(Ayodhya Ram Mandir) ఎన్నో జన్మల పుణ్యఫలం అయోధ్య రాముని దర్శనం. అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన బాలరాముడు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన జరిగిన నాటి నుంచి భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రామ్‌లల్లాను తనివితీరా దర్శించేందుకు భక్తులు క్యూ కట్టారు. 




 


తీవ్రమైన చలి కూడా లెక్కచేయకుండా రామచంద్రుని సర్వ దర్శనానికి బారులు తీరారు. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం పలు సేవా సంస్థలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రామ్‌పథ్‌ తదితర మార్గాల నుంచి వస్తున్న భక్తుల కోసం ఉచిత భోజనశాలలు అందుబాటులో ఉంచారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రామ్‌లల్లా సందర్శకుల కోసం టెంట్ సిటీని ప్రారంభించారు. దీనిలో 25 వేల మంది భక్తులు బస చేసేందుకు అవకాశం ఉంది. అంతేగాక, ఈ టెంట్‌ సిటీలోనూ భక్తుల కోసం ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు.




Tags:    

Similar News