Dhoni : అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేసిన ధోని
మహేంద్ర సింగ్ ధోనీ...క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ధోని స్క్రీన్ మీద కనబడితే చాలు ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతుంటారు. క్రికెట్ గ్రౌండ్ లోనే కాదు..బయట ఎక్కడైనా మహీ ఫొటో కనబడితే లైకులు, షేర్లతో సోషల్ మీడియా దుమ్ములేపేస్తుంటారు. యువ క్రికెటర్లకు పోటీగా తన ఫిజిక్, ఆటతీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉంటాడు. గ్రౌండ్ లో ధోని అడుగుపెడితే చాలు అది ఏ హోమ్ గ్రౌండైనా సరే మోత మోగిపోవాల్సిందే..అంత అశేష అభిమాన్ని సంపాదించుకున్నాడు ఈ మిస్టర్ కూల్. ప్రస్తుతం ధోనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రముఖ బిజినెస్మేన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా సాగుతున్న సంగతి తెలిసిందే. జామ్‌నగర్‌లో జరుగుతున్న ఈ వేడుకల్లో నేషనల్, ఇంటర్నేషనల్ నుంచి ప్రముఖులు హాజరైయ్యారు. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సందడి చేశారు. బాలీవుడ్ సాంగ్ కు దాండియా ఆడుతూ స్టేప్పులేశారు. భార్య సాక్షి, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో కలిసి సరదాగా దాండియా ఆడుతూ కనిపించారు. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఈ వీడియోని పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.
అయితే ఈ వీడియోలో ధోని లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లాంగ్ హెయిర్ తో వింటేజ్ ధోనిలా కనిపిస్తున్నాడని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ప్రస్తుతం ధోని ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. త్వరలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ తో ఫ్యాన్స్ ను పలకరించబోతున్నారు. ధోని కొత్త లుక్ లో కనిపిస్తుడడంతో వింటేజ్ తలా ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.