పడవ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన

By :  Krishna
Update: 2024-01-18 16:29 GMT

గుజరాత్లో జరిగిన ఘోర పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో విద్యార్థులు, టీచర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ‘‘ ఈ దుఖ: సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతోనే ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాల సాయం అందిస్తోంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడినవారికి 50వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షలు, గాయపడ్డవారికి 50వేల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.

కాగా వడోదర జిల్లాలోని హర్ని మోత్నాథ్ సరస్సులో పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది విద్యార్థులు సహా ఇద్దరు టీచర్లు మరణించారు. ప్రమాద సమయంలో పడవలో 35 మంది ఉన్నారు. విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవలో పరిమితికి మించి మందిని ఎక్కించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం భూపేందర్ పటేల్ తెలిపారు. ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు న్యూ సన్‌రైజ్ స్కూల్‌కు చెందినవారిగా అధికారులు గుర్తించారు.


Tags:    

Similar News