Divorce Dispute : నేనడిగింది ఇస్తేనే నీకు విడాకులు.. భార్యకు కండీషన్

Byline :  Veerendra Prasad
Update: 2023-12-23 03:12 GMT

పెళ్లికి ముందు తాను ఇచ్చిన కానుకను తిరిగిస్తేనే.. నువ్వు కోరుకున్నట్లు విడాకులిస్తానని ఓ భర్త.. తన భార్యకు కండీషన్ పెట్టాడు. అందుకు ఆమె ససేమీరా అంది. తమ పంతం నెగ్గించుకునే క్రమంలో.. ఆ కానుక కోసం దాదాపు మూడేళ్లపాటు.. కోర్టులో ఈ కేసు నడిచింది. చివరకు విడాకుల కోసం సదరు మహిళ.. ఆ కానుకు తిరిగి భర్తకు ఇవ్వకతప్పలేదు. ఇంతకీ ఆ కానుకేంటో తెలుసా. ఓ చిలుక. ఓ అందమైన ఆఫ్రికన్‌ గ్రే చిలుక భార్యాభర్తల విడాకుల కేసును మూడేళ్లు నడిపింది. ఈ విచిత్రమైన విడాకుల కేసు మహారాష్ట్రలోని పూణెలోని వెలుగు చూసింది.

పుణెకు చెందిన ఓ జంట 2019లో వివాహం చేసుకున్నారు. అయితే వివాహం అయిన కొద్ది రోజులకే(సెప్టెంబరు 2021) భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆ దంపతులు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పుణెలోని ఫ్యామిలీ కోర్టులో భార్యాభర్తలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ఆ దంపతులు ఇద్దరికీ ఫ్యామిలీ కోర్టులో కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటీకీ ఆ ఇద్దరూ విడాకులు తీసుకునేందుకే సిద్ధమయ్యారు. అయితే విడాకులు ఇచ్చేందుకు తన భార్యకు ఓ కండీషన్ పెట్టాడు ఆమె భర్త. ' నేను నీకు ఇచ్చిన ఆఫ్రికన్ చిలుకను తిరిగి ఇస్తేనే విడాకులు ఇస్తాను' అని అతడి భార్యను డిమాండ్ చేశాడు. అయితే తొలుత ఆమె చిలుకను ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విధంగా ఫ్యామిలీ కోర్టులో మూడేళ్లుగా ఈ భార్యాభర్తల విడాకుల కేసు కొనసాగింది. ఎట్టకేలకు తన భర్తకు ఆఫ్రికన్ చిలుకను ఇచ్చేందుకు అతడి భార్య అంగీకరించింది. దీంతో దంపతులు విడాకులు తీసుకున్నారు 




Tags:    

Similar News