Kawasaki Bike : భారత్ మార్కెట్‌లోకి అప్డేటెడ్ కవాసాకీ Z650RS బైక్ ధర ఎంతో తెలుసా ?

Byline :  Vamshi
Update: 2024-02-18 14:05 GMT

ముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కవాసాకీ భారత్ మార్కట్లోకి అప్డేటెడ్ వర్షన్ కవాసాకి Z650RS మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ఈ మిడిల్ వైట్ మోటారు సైకిల్ మోడర్న్, క్లాసిక్ ఎలిమెంట్స్‌తో కలిసి వస్తుంది. కపాసాకి Z650RS మోటారు సైకిల్2-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ మోడల్ లో అదనంగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ను పొందుపర్చారు. ఇందులో రైడర్ ఎంచుకోవడానికి రెండు ట్రాక్షన్ మోడ్ లు ఉన్నాయి. ఇది కాకుండా, జెడ్ 650 ఆర్ఎస్ 2024 మోడల్ లో అదనంగా ఎటువంటి మార్పులు లేవు. ఈ మోటార్ సైకిల్ భారతదేశంలో మెటాలిక్ మ్యాట్ కార్బన్ గ్రే రంగులో మాత్రమే లభిస్తుంది. అయితే, గ్లోబల్ మార్కెట్లో, ఇతర రంగులు కూడా ఆఫర్లో ఉన్నాయి.

కెటిఆర్ఎస్ లేదా కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (Kawasaki Traction Control System) వల్ల బైక్ సేఫ్టీ మరింత పెరుగుతుంది. ముఖ్యంగా రోడ్లు తడిగా ఉన్నప్పుడు లేదా కంకర తేలి ఉన్నప్పుడు బైక్ రైడర్ కు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ఈ సిస్టమ్ రక్షిస్తుంది. జెడ్ 650ఆర్ఎస్ (2024 Kawasaki Z650RS) ఆధునిక ఇంజిన్ తో వచ్చే రెట్రో స్టైలింగ్ కు ప్రసిద్ది చెందింది. ముందు భాగంలో వృత్తాకార హెడ్ ల్యాంప్, మధ్యలో డిజిటల్ రీడ్ అవుట్ తో కూడిన ట్విన్ అనలాగ్ డయల్స్, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, స్లిమ్ టెయిల్ సెక్షన్ ఉన్నాయి. కవాసాకి జెడ్ 650ఆర్ఎస్ లో నింజా 650, వెర్సిస్ 650 లలో ఉన్న, అదే 649 సిసి, లిక్విడ్-కూల్డ్, పారలల్-ట్విన్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 8,000 ఆర్ పిఎమ్ వద్ద 67 బిహెచ్ పి పవర్, 6,700 ఆర్ పిఎమ్ వద్ద 64 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. గేర్ బాక్స్ 6-స్పీడ్ యూనిట్, ఇది అసిస్ట్ మరియు స్లిప్ క్లచ్ తో వస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో ట్యూబ్యులర్ డైమండ్ ఫ్రేమ్ తో మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు భాగంలో డ్యూయల్ 272 ఎంఎం డిస్క్, వెనుక భాగంలో 186 ఎంఎం డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

Tags:    

Similar News