UP CM Adityanath : ఇండియాలో అత్యంత పాపులర్ సీఎం ఎవరో తెలుసా!

Update: 2024-02-04 04:08 GMT

(UP CM Adityanath) ఇండియాలో మోస్ట్ పాపులర్ సీఎంగా నిలిచారు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్. ఇండియాలో ఇతర సీఎంల కంటే ట్వీటర్ లో అత్యధిక ఫాలోవర్లు సొంతం చేసుకున్నారు. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మార్కు దాటింది. యోగి తర్వాత ఢిల్లీ ముఖ్యంత్రి కేజ్రీవాల్ తరువాతి స్థానంలో ఉన్నారు. కేజ్రీవాల్ పర్స్నల్ ఎక్స్ అకౌంట్‌ ను 27.3 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. 24.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్న రాహుల్ కంటే కూడా యోగి ముందే ఉన్నారు. ఇక యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌కు 19.1 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు.

ముఖ్యమంత్రి యోగి పర్స్నల్ అకౌంట్‌తో పాటూ ఆయన పర్స్నల్ ఆఫీస్ అకౌంట్‌ను కూడా నెటిజన్లు భారీగా ఫాలో అవుతున్నారు. కోటి మందికి పైగా యోగి ఆఫీస్ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో సీఎం యోగి ఎంత ముందు ఉంటారో మనకు తెలుసు. లా అండ్ అర్డర్ క్రాస్ చేసిన వారిని ఆయన అస్సలు ఉపేక్షించరని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరహా పాలనకు యోగి మోడల్ అని కూడా పేరు పెట్టారు. మరోవైపు, బాలరాముని మందిర ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై కూడా సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ఇక ట్విట్టర్ ఫాలోవర్ల పరంగా ప్రధాని మోదీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఆయనను ఏకంగా 95.1 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. 34.4 మిలియన్ ఫాలోవర్లతో హోం మంత్రి అమిత్ షా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.  




Tags:    

Similar News