Naveen Patnaik : దేశంలోనే అత్యంత పాపులర్‌ సీఎం ఎవరో తెలుసా!

Byline :  Vinitha
Update: 2024-02-18 06:44 GMT

దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న ముఖ్యమంత్రుల లిస్ట్ లో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ టాప్ లో నిలిచారు. ఆయన తర్వాత ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఉన్నారు. ఇంతకు ముందు టాప్ లో ఉన్న యోగి ఇప్పుడు ఒక ర్యాంకు కిందకు చేరారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది.

ఇండియాలో ఎక్కువ కాలం సీఎంగా ఉన్న నవీన్‌ పట్నాయక్‌ 52.7 శాతం ప్రజాదరణతో అగ్రస్థానంలో ఉన్నారు. 2000 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన తర్వాత 51.3 శాతం పాపులారిటీతో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రెండో స్థానంలో నిలిచారు. ఈయన 2017 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ 48.6 శాతం ప్రజాదరణతో మూడో స్థానంలో ఉన్నారు. 2021లో ఆయన బాధ్యతలు చేపట్టారు. తర్వాత వరుసగా 42.6 శాతంతో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ నాలుగవ స్థానంలో, తిప్రుర సీఎం మాణిక్‌ సాహా 41.4 శాతం ప్రజాదరణతో ఐదో స్థానం దక్కించుకున్నారు. 2016లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సాహా 2022లో అధికారం చేజిక్కించుకున్నారు.




Tags:    

Similar News