శ్రీలంకలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

By :  Kiran
Update: 2023-11-14 09:49 GMT

శ్రీలంకలో భారీ భూకంపం వచ్చింది. దేశ రాజధాని కొలంబోను భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై దాని తీవ్రత 6.2గా నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. భూ ప్రకంపనల తీవ్రతకు కొన్ని చోట్ల ఇండ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి.

కొలంబోకి ఆగ్నేయగుా 1326 కి.మీ దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) ప్రకటించింది. అయితే, ఆస్తి, ప్రాణనష్టం గురించిన వివరాలు ఇంకా తెలియలేదు. తాజా భూకంపం వల్ల శ్రీలంకకు పెద్దగా నష్టం లేదని అమెరికా జియోలాజికల్‌ సర్వే అండ్‌ మైన్స్‌ బ్యూరో (జీఎస్‌ఎంబీ) స్పష్టం చేసింది.

Tags:    

Similar News