మహారాష్ట్రలో స్వల్ప భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

Byline :  Kiran
author icon
Update: 2023-11-20 05:47 GMT
మహారాష్ట్రలో స్వల్ప భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
  • whatsapp icon

మహారాష్ట్రలో స్వల్ప భూకంపం వచ్చింది. హింగోలి ప్రాంతంలో సోమవారం ఉదయం 5:09 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు.

భూ ప్రకంపనల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.




Tags:    

Similar News