జమ్మూ కాశ్మీర్లో భూకంపం వచ్చింది. లడాఖ్ లో శనివారం ఉదయం 8.25గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. భూమికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
మరోవైపు బంగ్లాదేశ్లోనూ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.8గా నమోదైంది. భూమికి 10కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించారు.