Rajasthan Election 2023: రాజస్థాన్లో పోలింగ్ తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ

By :  Kiran
Update: 2023-10-11 12:00 GMT

రాజస్థాన్ పోలింగ్ తేదీని ఎలక్షన్ కమిషన్ మార్చింది. వివిధ రాజకీయ పక్షాలు, సామాజిక సంస్థల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 23న పోలింగ్ నిర్వహిస్తే ఓటింగ్ శాతం తగ్గే అవకాశముందన్న ఆందోళనల నేపథ్యంలో ఈసీ కొత్త తేదీ ప్రకటించింది.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ నవంబర్ 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలింగ్ శాతం తగ్గే అవకాశముందని అందుకే ఎన్నిక తేదీని మార్చాలని పలు రాజకీయ పార్టీలు ఈసీకి వినతి పత్రం అందజేశాయి. వాటిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ పోలింగ్ తేదీలో మార్పు చేసింది. నవంబర్ 23కు బదులు 25న పోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

ఈసీ విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 30న నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ 6 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. నవంబర్ 7న వాటి పరిశీలన జరగనుంది. నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు 9వ తేదీ వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 25 శనివారం రోజున పోలింగ్ జరగనుంది. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటే రాజస్థాన్ లోనూ డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

Tags:    

Similar News