Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. ఆ ఈడీ ఆఫీసర్లే లంచం తీసుకుని..!

Byline :  Bharath
Update: 2023-08-28 17:18 GMT

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పిడుగు లాంటి వార్త బయటపడింది. తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో తాజాగా కొత్త కోణం బయటకు వచ్చింది. లిక్కర్ స్కాంను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈడీ అధికారులు నిందితుల నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు బయటకు వచ్చాయి. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీ సహా మరో ఆరుగురు అధికారులను అరెస్ట్ చేశారు.




 


వీళ్లతోపాటు క్లారిడ్జెస్ హోటల్ సీఈవో విక్రమాదిత్య, ఎయిరిండియా ఉద్యోగి దీపక్ సంగ్వాన్ ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. లిక్కర్ స్కాంలో నిందితుడు అమన్ దీప్ సింగ్ నుంచి రూ.5 కోట్ల లంచం తీసుకున్నట్లు విచారణలో తేలింది. వీళ్లతో పాటు అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ నితేష్‌ కోహర్‌, ఎయిర్ ఇండియా ఉద్యోగి దీపక్ సాంగ్వాన్‌, అమన్‌దీప్ సింగ్ ధాల్, బీరేందర్ పాల్ సింగ్, ప్రవీణ్ కుమార్ వాట్స్‌పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.




 

 

Tags:    

Similar News