Dil Bagh Singh : ఈడీ సోదాలు.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఫారిన్ తుపాకులు.. నోట్ల కట్టలు
Byline : Bharath
Update: 2024-01-05 06:47 GMT
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులు.. నోట్ల కట్టలు, తుపాకులను పట్టుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యాణా నేత దిల్ బాగ్ సింగ్ ఇంట్లో ఈడీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఆ రైడ్ లో రూ.కోటి నగదు, విదేశాల్లో తయారైన తుపాకులు, 100కు పైగా మద్యం బాటిళ్లు, కేజీల కొద్దీ బంగారం, వెండిని పట్టుకుని సీజ్ చేశారు. దిల్ బాగ్ సింగ్, ఆయన అనుచరులకు చెందిన ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపింది. గురువారం (జనవరి 4) ఉదయం మొదలైన ఈ సోదాలు శుక్రవారం (జనవరి 5) కూడా కొనసాగుతున్నాయి.