Land For Jobs Case:: లాలూ ప్రసాద్ ఆస్తులు సీజ్

Update: 2023-07-31 14:03 GMT

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ఈడీ షాక్ ఇచ్చింది. పాత కేసులు ఆయనను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసుకు సంబంధించి తాజాగా బిహార్, ఢిల్లీలో ఉన్న లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యుల ఆస్తులపై ఈడీ దాడి చేసింది. ఈ కేసులో 2022లో లాలూపై ఎఫ్ఐఆర్ నమోదయింది. లాలూతో పాటు ఆయ‌న భార్య‌, కూతుళ్లు మీసా భార‌తి, హేమా యాద‌వ్‌లు కూడా ఈ కేసులో ఉన్నారు. దీంతా ఆ రాష్ట్రం రాజకీయ చర్చ నీయాంశంగా మారింది.

రైల్వే శాఖ మంత్నిగా ఉన్న టైంలో లాలూ.. తన పదవిని దుర్వినియోగం చేశాడని సీబీఐ అధికారులు ఆరోపించారు. ఎటువంటి పరిక్ష ప్రక్రియ చేపట్టకుండా.. బీహార్ యువతకు గ్రూప్ డీ పోస్టులను కేటాయించినట్లు రిపోర్టులో పేర్కొంది. అంతేకాకుండా దాణా కుంభకోణంలో లక్ష చదరపు గజాల భూమిని లాలూ కుటుంబం రూ. 26 లక్షలకే కొనుగోలు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్య కారణాలతో లాలూ బెయిల్ పై బయటకు వచ్చారు.


Tags:    

Similar News