ముఖ్యమంత్రి నివాసానికి ఈడీ..మనీలాండరింగ్, భూకుంభకోణం పై విచారణ

Update: 2024-01-29 08:53 GMT

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ను విచారించేందుకు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ చేరుకుంది. మనీలాండరింగ్, భూకుంభకోణానికి సంబంధించిన కేసులో ఈనెల 27న సీఎంకు ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 29, 31 తేదీల్లో అందుబాటులో ఉండాలని కోరింది. ఈ రెండురోజుల్లో ఏదో ఒకరోజు విచారణకు హాజరయ్యేలా ఈడీ అవకాశం కల్పించింది. కాగా ఈ నోటీసులపై సీఎం హేమంత్ ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. దీంతో విచారణ కోసం ఇవాళ ఈడీ అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. జనవరి 20న మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా.. రాంచీలోని సోరెన్‌ ఇంటికి వెళ్లిన అధికారులు వాంగ్మూలాన్ని ఫైల్ చేశారు. దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ..ముఖ్యమంత్రి హేమంత్ కు ఇప్పటివరకు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది.


Tags:    

Similar News