Election Commission : ఏప్రిల్ 16న లోక్ సభ ఎన్నికలు.. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే..?

Byline :  Kiran
Update: 2024-01-23 14:14 GMT

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్కులర్ వైరల్ గా మారింది. దాని ఆధారంగా ఏప్రిల్ 16న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ అదే రోజున జరగనున్నాయంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనుమానాలకు తెరదించుతూ ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది.

ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన సర్కులర్ లో ఉన్న ఏప్రిల్ 16ను ఎన్నికల రిఫరెన్స్‌ డేట్గా తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీ ఎన్నిక ముఖ్య అధికారి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ప్లానర్ ప్రకారం పోలింగ్‌కు ఏర్పాట్లు చేసుకొనేందుకే ఏప్రిల్ 16వ తేదీని రిఫరెన్స్‌గా తీసుకోవాలని మాత్రమే అధికారులకు సర్క్యులర్‌ జారీ చేసినట్లు చెప్పారు. సర్క్యులర్‌లోని డేట్స్ గురించి మీడియా సంస్థల నుంచి ప్రశ్నలు వస్తున్నాయని అందుకే క్లారిఫికేషన్ జారీ చేశామని అన్నారు. ఢిల్లీ సీఈవో చేసిన ట్వీట్‌ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీట్వీట్‌ చేసింది.

ఇదిలా ఉంటే ఈసీ సర్కులర్లోని రిఫరెన్స్ తేదీలను గమనిస్తే 2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కు కాస్త అటు ఇటుగా ఈసారి ఎన్నికలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఈసీ 2019 మార్చి 10న షెడ్యూల్‌ రిలీజ్ చేసింది. ఏప్రిల్‌ 11, ఏప్రిల్‌ 18, ఏప్రిల్‌ 23, ఏప్రిల్‌ 29, మే 6, మే 12, మే 19ల్లో మొత్తం 7దశల్లో ఎన్నికలు నిర్వహించింది. మే 23న ఫలితాలు వెలువడ్డాయి.






 


Tags:    

Similar News