కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇకపై ఈ పోర్టల్‌లోనే రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఆర్థిక వివరాలతో పాటు ఎన్నికలకు సంబంధించి ఖర్చులు, పార్టీకి వచ్చిన విరాళాలు తదితర వివరాలను ఈ పోర్టల్ ద్వారా అందించవచ్చు.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో ఈ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ‘‘రాజకీయ పార్టీలు తమ ఫైనాన్షియల్ అకౌంట్స్‌కి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేసేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నాం. ఎన్నికల వ్యయంపై పారదర్శకత ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది’’ అని ఈసీ తెలిపింది.
ఫిజికల్ రిపోర్ట్స్‌ని సబ్మిట్ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, వాటికి పరిష్కారంగానే ఈ కొత్త పోర్టల్ తీసుకొచ్చామని అధికారులు వెల్లడించారు. ఏదైనా ఓ పార్టీ ఆన్‌లైన్ ఈ లెక్కలు సబ్మిట్ చేయకపోతే..అందుకు కారణాలేంటో ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమర్పించకపోతే నిర్దేశించిన ఫార్మాట్‌లో సీడీలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ కాపీ ఫార్మాట్‌లో నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది.
Political Parties will now be able to file financial accounts online, with the Election Commission opening a web portal for filing of three types of reports - Contribution Report, Audited Annual Account and Election Expenditure Statements by Political Parties: Election Commission… pic.twitter.com/v3UK01YCzj
— ANI (@ANI) July 3, 2023