దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయనుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, అసోం, అరుణచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించుంది. గత లోక్సభ ఎన్నికలను మార్చి 10వ తేదీన ప్రకటించగా ఈసారి మాత్రం ఆరు రోజులు ఆలస్యంగా ప్రకటిస్తున్నది.
గత ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 23న కంప్లీట్ కావడంతో నెలాఖరుకే కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. గత ఎన్నికలు ఏడు ఫేజ్లలో కంప్లీట్ అయింది. ఈసారి వేసవి తీవ్రత దృష్ట్యా ఎన్ని దశల్లో ఉంటుందనేది ఆసక్తికరంగా మారిది.ఇద్దరి కమిషనర్ల ఎంపిక నిన్న జరిగింది. దీంతో రేపు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. రేపటి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. అందుకే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిన్న రాత్రే నిర్ణయం తీసుకుంది.