మధ్యప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన

Update: 2023-07-07 15:30 GMT

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన ఘటన మరువకముందే అదే రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత, వెనకబడిన తరగతులకు చెందిన ఇద్దరు యువకులతో మలం తినిపించారు. ఈ ఘటన జూన్ 30న జరగగా ఆలస్యంగా బయటపడింది.

ఏం జరిగిందంటే...

శివపురిలోని నార్వార్ ప్రాంతంలో స్థానికంగా ఉన్న మైనారిటీ కుటుంబం జాతవ్ కమ్యూనిటీకి చెందిన దళితుడు, కేవత్ కమ్యూనిటీకి చెందిన మరో యువకుడిపై దాడి జరిగింది. తప్పుడు లైంగిక ఆరోపణ మోపి దారుణంగా హింసించారు. అంతటితో ఆగకుండా మలం తినిపించారు. ముఖానికి నల్లరంగు పూసి బలవంతంగా ఊరేగించారు. ఈ ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. . ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసున్నారు. ఇద్దరు యువకులపై చేసిన ఆరోపణలు అవాస్తవమని పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనను మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమంగా నిర్మించిన వారి ఆస్తుల్ని కూల్చేయాలని శివపురిలోని స్థానిక పరిపాలకు ఆదేశాలు జారీ చేసినట్లు నరోత్తమ్ మిశ్రా చెప్పారు

ఓ ఆదివాసీ వ్యక్తిపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుడి ఇంటిని కూడా బుల్డోజర్‎తో కూల్చివేశారు. బాధితుడి పాదాలను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం కడిగారు. ఈ సంఘటనపై అతడికి క్షమాపణలు చెప్పారు.


Tags:    

Similar News