ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్).. తనకు వచ్చిన ప్రతి మూడవ లోన్క్లెయిమ్ను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ ఫైనల్ సెటిల్‌మెంట్ కోసం మొత్తం 73.87 లక్షల అప్లికేషన్లు రాగా.. వీటిలో 33.8 శాతం (24.93 లక్షలు) అప్లికేషన్లను రిజెక్ట్ చేయబడ్డాయి.
అయితే వీటిలోని 46.66 లక్షలు క్లెయిమ్స్‌ను సెటిల్ చేశారు. కాగా 2017-18, 2018-19లో ఉన్న రిజెక్షన్ రేటు కంటే ఇది చాలా ఎక్కువ అని విశ్లేషకులు చెప్తున్నారు. 2019-20లో ఫైనల్ సెటిల్మెంట్ క్లెయిమ్‌ల రిజెక్షన్లు 24.1 శాతం ఉన్నాయి. 2020-21లో అవి 30.8 శాతానికి పెరగగా.. 2021-22లో ఇది 35.2 శాతానికి చేరింది. వీటివల్ల తమపై విపరీతంగా పనిభారం ఉందని ఈపీఎఫ్ఓ ఉద్యోగులు అంటున్నారు.