Gorakhpur Train : సీటు కోసం గల్లా పట్టుకొని కొట్టారు.. వైరల్ వీడియో
బస్సుల్లో సీట్ల కోసం సిగపట్లు పట్టిన మహిళల గురించి మీరు వినే ఉంటారు. చెప్పులతో దాడి చేస్తూ, కండక్టర్లపై ఎదురు తిరుగుతూ.. తమ సత్తా ఏంటో చూపిన మహిళల శక్తిని వీడియోల రూపంలో చూసే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాత్రం.. అంతకుమించి అన్నట్లుగా ఉంటుంది. ఇప్పటివరకూ సీటు కోసం తోటి మహిళలపైనే చేయి చేసుకున్న నారీమణులు.. తాజాగా ఓ పురుషుణ్ని గల్లా పట్టుకొని మరీ బెదిరించారు. కూర్చున్న చోటునే దబాయించి గొడవకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మొన్న మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు జరిగిందీ సంఘటన. డెహ్రాడూన్ నుంచి గోరఖ్‌పూర్ వెళుతున్న రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు తల్లీకూతుళ్లు.. కూర్చొనేందుకు సీటు దొరక్క ఇబ్బందిపడ్డారు. రైలు నిండా ప్రయాణికులుండడంతో కాస్త అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలోనే పైన అప్పర్ బెర్త్‌లో కూర్చున్న ఓ వ్యక్తిని.. సీటు దిగాలని బెదిరించారు. ఆ మగజాతి ఆణిముత్యం.. మామూలు మాటలతో వినకపోవడంతో.. చేతికి పని చెప్పారు. చొక్కా కాలర్ పట్టుకొని కిందకు దిగుతావా? లేదా? అంటూ ప్రశ్నించారు. ఒకరు గల్లా పట్టుకొని కొడుతుండగా.. మరొకరు తిట్ల పురాణం స్టార్ట్ చేశారు. ఇంత జరుగుతున్నా.. అక్కడున్న తోటి ప్రయాణికులంతా చోద్యం చూశారే కానీ.. వారిలో ఎవ్వరినీ ఆపే ప్రయత్నం కూడా చేయలేదు.
రైలులో జరిగిన ఈ బాగోతాన్ని .. ఎదురు బెర్తులో కూర్చున్న వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను అర్హంత్ షెల్బీ అనే నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. వీడియోకు కామెంట్ల వర్షం కురుస్తోంది. మహిళా దినోత్సవం రోజున సీట్ల సమస్యపై మహిళలు చేపట్టిన ఆందోళన అంటూ ఒకరు కామెంట్ చేయగా.. మహిళా సాధికారతకు ఇదే నిదర్శనమంటూ మరికొంతమంది పోస్టు చేస్తున్నారు. మార్చి 8 న రాత్రి 7 గంటల తర్వాత అప్‌లోడ్ అయిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్, వేల సంఖ్యలో లైకులు వచ్చి పడుతున్నాయి. మరీ ఈ వీడియోపై మీ కామెంట్స్ ఏంటో మీరూ కామెంట్ చేయండి..
Kalesh b/w a Mother-Daughter Duo and a Man inside Dehradun to Gorakhpur train over Seat issues on Women's Day
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 8, 2024
pic.twitter.com/N4Xrcy7hAS