హాస్పిటల్ డీన్ ఫిర్యాదు.. ఎంపీపై కేసు నమోదు

Byline :  Kiran
Update: 2023-10-04 10:29 GMT

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన శివసేన ఎంపీ హేమంత్ పటేల్పై కేసు నమోదైంది. నాందేడ్ ప్రభుత్వ హాస్పిటల్‌ డీన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్, ఐపీసీ, మహారాష్ట్ర మెడికేర్ సర్వేస్ పర్సన్స్ అండ్ మెడికేర్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ లోని పలు సెక్షన్లను ఎంపీ హేమంత్పై మోపారు.

నాందేడ్లోని శంకర్రావ్ చవాన్ గవర్నమెంట్ హాస్పిటల్లో 48 గంటల్లో 31 మంది రోగులు మృత్యువాతపడ్డారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీఎం షిండే వర్గానికి చెందిన ఎంపీ హేమంత్ పాటిల్ మంగళవారం హాస్పిటల్ ను సందర్శించారు. ఆ సమయంలో ఆస్పత్రిలోని కొన్ని టాయిలెట్స్ కు తాళాలు వేసి ఉండటం, మరికొన్ని మురికిగా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ టెంపరరీ డీన్ ఆర్ఎస్ వాకోడ్ తో టాయిలెట్ క్లీన్ చేయించారు. ఈ ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎంపీ హేమంత్‌ పాటిల్‌పై ఆసుపత్రి డీన్‌ వాకోడ్‌ పోలీసులకు కంప్టైంట్ చేశారు. తనతో టాయిలెట్లు క్లీన్‌ చేయించడం వల్ల బీపీ పెరిగిందని, ప్రభుత్వ అధికారి విధులు అడ్డుకోవడం, పరువు తీశారని అందులో ప్రస్తావించారు. డీన్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎంపీ హేమంత్ పాటిల్పై కేసు బుక్ చేశారు.




Tags:    

Similar News