Udhayanidhi Stalin : ఉదయనిధి స్టాలిన్..మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు

Byline :  Aruna
Update: 2023-09-06 05:53 GMT

 సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కాదు పూర్తిగా నిర్మూలించాలని...సామాజిక న్యాయం, సమానత్వానికి సనాతన ధర్మం విరుద్ధమని తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, మినిస్టర్ ఉద‌య‌నిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు, బీజేపీ కార్యకర్తులు తీవ్రంగా స్పందించారు. అంతే కాదు ఉదయనిధిపై పలు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఉద‌య‌నిధితో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేపైన ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. మతపరమైన మనోభావాలను వీరు దెబ్బతీస్తున్నారంటూ యూపీలోని రాంపూర్‎లో వీరిద్దరిపై న్యాయవాదులు కేసును నమోదు చేశారు.




 


డీఎంకే నాయకుడు, మినిస్టర్ ఉద‌య‌నిధి స్టాలిన్‌‎తో ప్రియాంక్ ఖ‌ర్గేల‌పై రాంపూర్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది. మ‌త‌ప‌ర‌మైన మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసినందుకుగాను వీరిద్దరిపై కేసులు పెట్టారు. స‌నాత‌న ధ‌ర్మాన్ని గురించి ఉద‌య‌నిధి స్టాలిన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు, ఆ వ్యాఖ్యలకు ప్రియాంక్ ఖ‌ర్గే మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో వీరిద్దరిపై ఐపీసీలోని సెక్ష‌న్ 295-ఏ , సెక్షన్ 153-ఏ కింద ఇద్ద‌రిపై విల్ లైన్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసులను ఫైల్ చేశారు

లాయ‌ర్లు హ‌ర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోధీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును ఫైల్ చేశారు. స‌నాత‌న ధ‌ర్మాన్ని డెంగ్యూ, మ‌లేరియాతో స్టాలిన్ పోల్చడాన్ని వీరు తీవ్రంగా తప్పుబట్టారు. 

Tags:    

Similar News