అగ్ని ప్రమాదం.. బిల్డింగ్పై నుంచి దూకిన ప్రజలు

Update: 2023-06-19 17:24 GMT

ఛత్తీస్ గఢ్ లోని కోర్బా జిల్లాలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ పోర్ట్ నగర్ ఏరియాలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బిల్డింగ్ అంతా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ భవనంలో ఉన్న ప్రజలు భయాందోళన చెందారు. బతుకు జీవుడా అంటూ ఎవరిదారిన వాళ్లు పరుగులు తీశారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఆడ, మగ తేడా లేకుండా మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేశారు. భారీగా ఎగసి పడుతున్న మంటల పక్కనుంచి కిందికి దూకుతున్న ప్రజలు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రమాదానికి గురైన కాంప్లెక్స్ లో బట్టల షాపులు, ఇండియన్ బ్యాంక్ లతో పాటు పలు దుకాణాలు ఉన్నాయి. బ్యాంకులో మొదలైన మంటలు క్షణాల్లో వ్యాపించాయి. అగ్ని భారీగా ఎగసిపడటంతో పక్క షాపులన్నీ దగ్దం అయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, ప్రమాదం జరగడానికి గల కారణం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఎవరికీ ఏ హానీ జరగలేదు. మొదటి అంతస్తు నుంచి కిందకి దూకడం వల్ల కొందరికి చిన్న చిన్న గాయాలయ్యాయి. 







Tags:    

Similar News