కర్నాటకలో ఘోరం.. బాణసంచా పేలి 12 మంది దుర్మరణం
కర్ణాటకలో ఘెర ప్రమాదం జరిగింది. పటాకుల గోదాంలో మంటలు చెలరేగి 12మంది మరణించారు. బెంగళూరు-హోసూరు జాతీయ రహదారిపై ఉన్నఅత్తిబెలె గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్ నుంచి బాణాసంచాను దించుతుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. మంటలు కొద్దిసేపటికే పెద్దఎత్తున వ్యాపించడంతో గోదాం మొత్తం కాలిపోయింది. గోదాం బయట ఉన్న వాహనాలన్నీ ఆగ్నికి ఆహుతయ్యాయి.
ఫైర్ సిబ్బందికి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదసమయంలో గోదాంలో 20మంది ఉన్నట్లు తెలుస్తోంది. అందులో పలువురు తప్పించుకున్నట్లు సమాచారం. ప్రమాదస్థలిని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరిశీలించారు. ఈ ప్రమాదంలో 12మంది మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు తన 5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.