లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..భయంతో ప్రయాణికుల పరుగులు

Update: 2023-06-22 16:56 GMT

చెన్నై-ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఓ కోచ్ నుంచి మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు నుంచి బయటకు దిగి భయంతో పరుగులు తీశారు. గురువారం సాయంత్రం బేసిన్ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియక రైలుకు దూరంగా ప్రయాణికులు పరుగులు తీయడం వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవోల్టేజీ విద్యుత్‌ లైన్‌లో రాపిడి కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.

Tags:    

Similar News