Ayodhya Ram Mandir : అంతరిక్షం నుంచి అయోధ్య ఎలా ఉందంటే..?

Byline :  Krishna
Update: 2024-01-21 15:45 GMT

మరికొన్ని గంటల్లో హిందూధర్మంలో సువర్ణాక్షరాలతో సరికొత్త అధ్యాయం లిఖితం కానుంది. సోమవారం అయోధ్యలో జరగనున్న రాముని ప్రాణ ప్రతిష్ఠకు అంతా సిద్ధమైంది. సోమవారం మధ్యాహ్నం 12.20 నుంచి 1వరకు బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. దీంతో దేశం మొత్తం రామనామ స్మరణతో మార్మోగుతోంది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం హిందువులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే అంతరిక్ష నుంచి అయోధ్య ఎలా ఉంటుంది..? ఈ ప్రశ్నకు ఇస్రో సమాధానం ఇచ్చింది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంతరిక్షం నుంచి రామ మందిరం ఫొటోలను తీసింది. డిసెంబర్ 16న తీసిన ఈ ఫొటోలు వైరల్గా మారాయి. ఈ ఫొటోల్లో అయోధ్య రామమందిరంతో పాటు సరయు నది, దశరథ్ మహల్ కినిపిస్తోన్నాయి.

Tags:    

Similar News