తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ పర్సనల్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీగా సౌమ్య మిశ్రాను నియమించింది. డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్గా ఎ ఆర్. శ్రీనివాస్, హోం గార్డ్స్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అంబర్ కిషోర్ ఝా, మేడ్చల్ డీసీపీగా శబరీష్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ట్రాన్స్ఫర్లు జరిగినట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే భారీ సంఖ్యలో ఐఎస్ఎస్ అధికారుల బదిలీలు చేసింది. దాదాపు 31 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ జూలై 14న ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన 31 మందిలో 16 మంది మహిళలు ఉన్నారు.