మాజీ సీఎంకు మరిన్ని కష్టాలు.. 5 రోజుల ఈడీ కస్టడీ..

Byline :  Kiran
Update: 2024-02-02 08:14 GMT

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు ప్రజా ప్రతినిధుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను 5 రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ధర్మాసనం తీర్పు చెప్పింది. రూ. 600 కోట్ల ల్యాండ్ స్కాంలో మనీలాండరింగ్కు సంబంధించి డిసెంబర్ 31న హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని రాంచీలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా హేమంత్ సోరెన్ ను 5 రోజుల కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది.

అంతకు ముందు సుప్రీంకోర్టులోనూ హేమంత్ సోరెన్కు ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును సవాలు చేయగా.. ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ధర్మాసనం, హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగం చేసి రూ.600 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని అలా సంపాదించిన డబ్బును విదేశాలకు తరలించారని ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసింది. అరెస్టు తప్పదని తేలడంతో రెండ్రోజుల క్రిత రాజ్ భవన్‌కు వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే అక్కడే ఉన్న ఈడీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. తొలుత హైకోర్టును ఆశ్రయించిన హేమంత్.. తరువాత పిటిషన్‌ వెనక్కి తీసుకుని సుప్రీం మెట్లెక్కారు.

Tags:    

Similar News