మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు తీవ్ర అస్వస్థత..ఆసుప్రతిలో చేరిక

Byline :  Vamshi
Update: 2024-03-14 06:32 GMT

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ తీవ్ర అస్వస్థత గురియ్యారు. ఆసుపత్రిలో చేరారు. మహారాష్ట్రలోని పూణెలోగల భారతీ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్యంపై అక్కడి వైద్యులు కీలక ప్రకటన చేశారు. ప్రతిభా పాటిల్‌కు జ్వరంతో పాటు ఛాతిలో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని తెలిపారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వైద్యులు తెలిపారు.

భారత్‌కు రాష్ట్రపతిగా పనిచేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2007 నుంచి 2012 వరకు పదవిలో ఉన్నారు. ఆమె భర్త దేవీసింగ్‌ షెకావత్‌ గతేడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో కన్నుమూశారు. 1962లో మహారాష్ట్రలోని జాల్‌గావ్‌ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985 వరకు వరుసగా నాలుగుసార్లు ఎద్లాబాద్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1985 నుంచి 90 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 1991 సాధారణ ఎన్నికల్లో అమరావతి నుంచి ఎంపీగా గెలుపొందారు.

Tags:    

Similar News