Imran Khan : పాక్ మాజీ ప్రధానీకి పదేండ్లు జైలు శిక్ష

Update: 2024-01-30 08:33 GMT

పాక్ మాజీ ప్రధానీ ఇమ్రాన్ ఖాన్ కు పదేండ్లు జైలు శిక్ష ఖరారైయింది. ఇమ్రాన్ ఖాన్ తో పాటు మాజీ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పు నిచ్చింది. దేశ అధికార రహాస్యాలను లీక్ చేసిన నేరం కింద శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు జడ్జి అబువల్ హస్నత్ ముహమ్మద్ ఉత్తర్వులు జారీ చేసినట్లు..ఇమ్రాన్ ఖాన్ తరపు లాయర్ షోయబ్ షాహీన్ మేసేజీ ద్వారా తెలిపారు.

ఈ తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వాషింగ్టన్‌లోని ఆ దేశ రాయబారి..ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వానికి పంపిన సీక్రెట్ కేబుల్‌లోని విషయాలను ఇమ్రాన్ ఖాన్ పంచుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు ఉంది. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీకి పది సంవత్సరాల చొప్పున శిక్ష విధించింది.

Tags:    

Similar News