మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. దేశానికి ఆయన చేసిన సేవలకుగానూ మరణానంతరం అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. పీవీతో పాటు ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్లకు భారతరత్న ప్రకటించారు. పీవీ 1991 నుంచి 1996 ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలతో భారత ఆర్ధిక వ్యవస్థను ఆయన గాడిన పెట్టారు. పీవీకీ భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. కేంద్రం నిర్ణయంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.