ఆగని అల్లర్లు...మేయర్ ఇంటికి నిప్పు

Update: 2023-07-02 09:52 GMT

ఫ్రాన్స్‌లో అల్లర్లు తగ్గుముఖం పట్టడం లేదు. పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల టీనేజర్‌ నాహెల్‌ను ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం కాల్చిచంపటంతో ఫ్రాన్స్‌లో మొదలైన దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఐదోరోజు కూడా ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. వేలమంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఎదురొచ్చిన వాహనానికల్లా నిప్పు పెడుతున్నారపారిస్‌, మార్సెయిల్‌, లియాన్‌ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించారు. ఏకంగా మేయర్ ఇంటికి నిప్పు పెట్టారు. మేయర్ కుటుంబం నిద్రిస్తున్న సమయంలో కారుకు నిప్పంటించి దానిని ఇంట్లోకి పంపించారు. ఈ ఘటనలో మేయర్ తో పాటు ఆయన భార్య, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పది షాపింగ్‌ మాళ్లు, 200లకు పైగా సూపర్‌ మార్కెట్లు, 250 బ్యాంకు సేవా కేంద్రాలతోపాటు ఇతర దుకాణాలపై దాడులు చేసి లూటీ చేశారు.




 


ఆందోళనకారులను అదుపుచేసేందుకు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. సుమారు 45వేల మంది పోలీసులతోపాటు ఇతర సాయుధ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఇప్పటివరకు వరకు సుమారు 2వేల మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కేవలం ఆదివారం ఉదయం ఒక్కరోజే 719 మందిని అదుపులోకి తీసుకున్నారు. 




 




 


Tags:    

Similar News