ప్రభుత్వం నిర్ణయం.. ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్
విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా విద్యార్థులు ఉత్తమ స్కోరు సాధించే అవకాశం ఉందని నూతన విద్యా విధానంలో తెలిపింది. దీని ద్వారా స్టూడెంట్స్ తమ ప్రిపరేషన్ కు తగ్గట్లు బోర్డ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంతేకాకుండా రెండు బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్లు ఆయా సబ్జెక్టుల్లో సాధించిన ఉత్తమ మార్కులను ఎంపిక చేసుకోవచ్చు.
దీని ప్రకారం.. 11, 12వ తరగతి చదివే విద్యార్థులు దేశ భాషతో సహా రెండు భాషలను చదవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న పరీక్షల విధానాన్ని మరింత సరళీకృతం చేసి.. ఏడాదికి రెండు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. దీనిద్వారా స్టూడెంట్స్ కు తగినంత టైం, పరీక్షలు బాగా రాసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు 2024 అకడమిక్ ఇయర్ కు సంబంధించిన పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నారు.