OyO : స్పోర్ట్స్‌ హాస్పిటాలిటీ వ్యాపారంలోకి ఓయో.. మొత్తం 100 హోటళ్లలో..

Byline :  Veerendra Prasad
Update: 2024-02-16 03:43 GMT

ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ ఓయో తాజాగా స్పోర్ట్స్‌ హాస్పిటాలిటీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. భారీ స్థాయి క్రీడల పోటీల నిర్వహణకు సంబంధించి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, పుణె సహా 12 కీలక నగరాల్లో 100 హోటల్స్‌ను షార్ట్‌లిస్ట్‌ చేసింది. రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ సంస్థ.. తమ హోటల్స్ ను పెద్ద ఎత్తున జరిగే క్రీడా సమావేశాల కోసం కూడా వేదికగా మార్చనుంది. ఇందుకోసం మొత్తం 12 ప్రధాన నగరాల్లో 100 హోటళ్లను కేటాయించింది. ఈ కొత్త వెంచర్ వివిధ క్రీడా పోటీలలో పాల్గొనే అథ్లెట్లు మరియు అధికారులకు వసతితో సహా సమగ్ర ఆతిథ్య మర్యాదలను అందించనుంది.

ది. స్పోర్ట్స్‌ టీమ్‌లు, పెద్ద బృందాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలు, గ్రూప్‌ బుకింగ్‌ ఆప్షన్స్‌ ఇస్తామని ఓయో వివరించింది. అలాగే క్రీడాకారులు, ఈవెంట్లను వీక్షించేందుకు వచ్చే వారి ఆహార, రవాణా అవసరాలను తీర్చే థర్డ్‌–పార్టీ ఏజెన్సీల సేవలను కూడా అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. ఓయో ప్రభుత్వ మరియు స్పోర్ట్స్ హాస్పిటాలిటీ బిజినెస్ హెడ్ పంకజ్ కుమార్ మాట్లాడుతూ అథ్లెట్లు పోటీ ప్రయత్నాలపై దృష్టిని కేంద్రీకరించేందుకు వీలుగా, వారికి ప్రోత్సాహకరమైన మరియు రిలాక్స్‌డ్ వాతావరణాన్ని సృష్టించడం తమ లక్ష్యమని అన్నారు.

ఓయో ఇప్పటికే దివ్యాంగులైన అథ్లెట్ల కోసం ప్రత్యేక సేవలను అందించే ప్రణాళికలను ప్రకటించింది. ఖేలో ఇండియా పారా గేమ్స్, పారా కబడ్డీ ఇంపాక్ట్ టోర్నమెంట్ మరియు సర్దార్ పటేల్ నేషనల్ దివ్యాంగ్ క్రికెట్ టోర్నమెంట్ వంటి ఈవెంట్‌లలో పాల్గొనేవారికి ప్రత్యేక సేవలను అందించనున్నట్లు తెలిపింది.




Tags:    

Similar News